మళ్లీ వస్తున్నా.. వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం

by Harish |

భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మళ్లీ వస్తున్నా.. వినేశ్ ఫొగట్ సంచలన నిర్ణయం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న ఆమె అదనపు బరువు కారణంగా అనర్హత వేటు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ షాక్‌లో వినేశ్ రెజ్లింగ్‌కు గుడ్ బై చెప్పింది. తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆమె తిరిగి రెజ్లింగ్‌లో పునరాగమనం చేయనున్నట్టు వెల్లడించింది. లాస్ ఏంజిల్స్-2028 ఒలింపిక్స్‌లో పాల్గొననున్నట్టు తెలిపింది. ‘పారిస్ ఒలింపిక్స్ తర్వాత నాకు ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇదే ముగింపా? అని కూడా అడిగారు. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు. అనర్హత వేటుతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. దాని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. మళ్లీ తిరిగి రావాలనుకుంటున్నా. ఈ సారి ఒంటరిగా రావడం లేదు. నాతో నా కొడుకు ఉన్నాడు. లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో కలుద్దాం.’అని వినేశ్ సోషల్ మీడియాలో వెల్లడించింది.


Next Story