వినేశ్ ఫొగాట్ కేసు కీలక మలుపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన డబ్ల్యూఎఫ్‌ఐ

by Ramesh Naini |

ఏషియన్ గేమ్స్ (ఆసియా క్రీడలు) 2026 ఎంపిక ట్రయల్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పాల్గొనేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత రెజ్లింగ్ సమాఖ్య సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.

వినేశ్ ఫొగాట్ కేసు కీలక మలుపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన డబ్ల్యూఎఫ్‌ఐ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏషియన్ గేమ్స్ (ఆసియా క్రీడలు) 2026 ఎంపిక ట్రయల్స్‌లో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పాల్గొనేందుకు అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించనుంది. మాతృత్వ విరామం (maternity break) తర్వాత పునరాగమనం చేస్తున్న వినేశ్ ఫొగాట్ వంటి దిగ్గజ క్రీడాకారిణిని పరిగణనలోకి తీసుకోకపోవడం సరికాదని, డబ్ల్యూఎఫ్‌ఐ ఎంపిక విధానం వివక్షాపూరితంగా ఉందని పేర్కొంటూ మే 22న ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆమెకు ట్రయల్స్‌లో పాల్గొనేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 30, 31 తేదీల్లో జరగబోయే ఈ ఎంపిక ట్రయల్స్‌ను పూర్తిగా వీడియో రికార్డింగ్ చేయాలని, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI), ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA)లకు చెందిన స్వతంత్ర పరిశీలకులు (observers) తప్పనిసరిగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story