- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిషబ్ పంత్ కు రూ.27 కోట్లు దండగే.. విజయ్ మాల్యా కామెంట్స్ వైరల్ !
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పై.. బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పై.. బెంగళూరు మాజీ యజమాని విజయ్ మాల్యా సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్నో జట్టు అనవసరంగా రిషబ్ పంత్ కు 27 కోట్లు చెల్లించిందని పరోక్షంగా విమర్శలు చేశారు విజయ్ మాల్యా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 సంవత్సరాల తర్వాత... ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఛాంపియన్ కావడంతో... ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్య తెరపైకి వచ్చారు.
ఈ తరుణంలోనే..ఓ పోడ్ కాస్ట్ కు విజయ్ మాల్యా ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇందులో విజయ్ మాల్యా మాట్లాడుతూ... బుమ్రా, kl రాహుల్, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లను బెంగళూరులోకి తీసుకువస్తానని.. యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ నలుగురు ప్లేయర్లు ఉంటే... కచ్చితంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరోసారి టోర్నమెంట్ గెలుస్తుందని వివరించారు. పంత్ కంటే కేఎల్ రాహుల్ బెస్ట్ ప్లేయర్ అంటూ కితాబ్ ఇచ్చారు.
అయితే ఈ వీడియో వైరల్ కావడంతో... రిషబ్ పంత్ ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. అనవసరంగా.. రిషబ్ పంత్ కు 27 కోట్లు ఇచ్చారని... ఎప్పటిలాగే రాహుల్ ను కెప్టెన్ గా కొనసాగిస్తే బాగుండేదని.. విజయ్ మాల్యా పరోక్షంగా చెప్పినట్లు కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు. పంత్ కు 27 కోట్లు దండగే... అంటూ విజయ్ మాల్యా పరోక్షంగా స్పందించారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు నెటిజెన్స్.






