ఐపీఎల్ లో 14 ఏళ్ళ కుర్రాడు చరిత్ర...మొదటి బంతికే

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025).. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi )... చుక్

ఐపీఎల్ లో 14 ఏళ్ళ కుర్రాడు చరిత్ర...మొదటి బంతికే
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025).. 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi )... చుక్కలు చూపిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) తరఫున... 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ.. ఇవాళ.. ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. మొన్నటి వరకు జరిగిన మ్యాచ్ లలో తీసుకోలేదు. కానీ ఇవాల్టి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి... చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్య వంశీ.

అతిపిన్న వయసులో ఐపీఎల్ మ్యాచ్... ఆడిన ప్లేయర్ గా రికార్డు లోకి ఎక్కాడు వైభవ్. అంతేకాదు... రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో బరిలోకి దిగిన వైభవ్ ( Vaibhav Suryavanshi )... తొలి బంతికే సిక్సర్ బాదాడు. అది కూడా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ లో తొలి బంతికే సిక్స్ కొట్టేశాడు. దీంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాడు వైభవ్ సూర్య వంశీ.

ఇది ఇలా ఉండగా... ఐపీఎల్ లో అత్యంత పిన్న వయస్కుల వివరాలు ఒకసారి పరిశీలిస్తే... 14 సంవత్సరాల వైభవ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రయాస్ రాయిబర్మన్ 16 ఏళ్ల వయసులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున... 2019లో బరిలోకి దిగాడు. ఇక ముజీబుర్ రెహమాన్ 17 ఏళ్ల వయసులో 2018 సంవత్సరంలో పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు. రియాన్ పరాగ్ 17 ఏళ్ల వయసులో రాజస్థాన్ రాయల్స్ తరఫున 2019లో... అరంగేట్రం చేశాడు.

Next Story