చెలరేగిన సాయితేజ.. యూఎస్ఏ భారీ విక్టరీ

by Phanindra |

సాయితేజ బ్యాటుతో చెలరేగడంతో టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఏ భారీ విక్టరీ నమోదు చేసింది. నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది.

చెలరేగిన సాయితేజ.. యూఎస్ఏ భారీ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్: టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఏ జట్టు భారీ విజయం సాధించింది. చెన్నయ్ వేదికగా నెదర్లాండ్స్‌ను ఎదుర్కొన్న ఈ జట్టు అదరగొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఎస్ఏకు కెప్టెన్ మోనాంక్ పటేల్ (36), షాయన్ జహంగీర్ (20) మంచి ఆరంభం అందించారు. సాయితేజ ముక్కమల్ల (79) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. చివర్లో శుభమ్ రాంజానే (48 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 196/6 పరుగుల భారీ స్కోరు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడ్ మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన నెదర్లాండ్స ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. బాస్ డి లీడ్ (23), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20) మాత్రమే కొంత పోరాటపటిమ కనబరిచారు. మిగతా వాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 15.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. అమెరికా బౌలర్లలో హర్మీత్ సింగ్ నాలుగు, షాడ్లీ వాన్ షాక్విక్ మూడు, మహమ్మద్ మొహ్‌సిన్ రెండు వికెట్లతో ఆకట్టుకున్నారు. యూఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Next Story