- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నా లాగే MS ధోని ఉంటాడు.. ఉప్పల్ బాలు కామెంట్స్ !

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) జరుగుతున్న నేపథ్యంలో.. అనవసరంగా చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni) ఫ్యాన్స్ ను గెలికాడు సోషల్ మీడియా స్టార్ ఉప్పల్ బాలు ( Uppal balu). మహేంద్రసింగ్ ధోని అలాగే నేను ఒకే లాగా ఉంటామని... ఈ విషయాన్ని చాలా మంది తనకు చెప్పినట్లు... ఉప్పల్ బాలు వెల్లడించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు.. యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ తరుణంలోనే మహేంద్ర సింగ్ ధోని అలాగే ఉప్పల్ బాలు మధ్య పోలిక గురించి యాంకర్ ప్రశ్నించాడు.
ఇంకే ముంది మహేంద్ర సింగ్ ధోని అలాగే నేను ఒకే తరహాలో ఉంటామని... మా ఇద్దరి ముఖాలు, హెయిర్ స్టైల్ సేమ్ టు సేమ్ ఉంటాయని చెప్పుకొచ్చాడు ఉప్పల్ బాలు. మా ఇద్దరి ఫోటోలు పక్క, పక్కన పెట్టి వైరల్ చేస్తారని కామెంట్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అలాగే ధోని ఫ్యాన్స్ ( MS Dhoni Fans) ... ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.
మిస్టర్ ఉప్పల్ బాలు.. నీ స్థాయి ఎక్కడ? ధోని స్థాయి ఎక్కడ...? నోటికి వచ్చింది మాట్లాడి పాపులర్ కావద్దు అంటూ ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇంకోసారి ధోని గురించి ఇంటర్వ్యూలలో... మాట్లాడితే బాగుండదు అంటూ వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ధోని స్థాయిని తగ్గించి అస్సలు మాట్లాడకూడదని వార్నింగ్ ఇస్తున్నారు. గతంలో కూడా అచ్చం ఇలాగే ఉప్పల్ బాలు... ధోని గురించి కామెంట్ చేసి ఎవరైనా సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ధోని గురించి మాట్లాడి వార్తల్లోకి ఎక్కాడు.
— Out of Context Telugu (@OutOfContextTel) April 29, 2025