- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tyson vs Paul: మ్యాచ్‌కు ముందు కీలక పరిణామం
by Gantepaka Srikanth |
ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బాక్సింగ్(Boxing) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి బాక్సింగ్(Boxing) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. చివరగా 2005లో బాక్సింగ్ ఆడిన దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్(Mike Tyson) మళ్లీ రింగ్‌లోకి దిగుతున్నారు. యూట్యూబర్ జేక్ పాల్(Jake Paul)తో ఈరోజు తలపడుతున్నారు. ఉదయం 9:30 ప్రారంభం కావాల్సి ఉండగా.. మ్యాచ్‌కు ముందు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. జేక్ పాల్‌ను మైక్ టైసన్ చెంపపై కొట్టాడు. దీంతో స్వల్ప వివాదం చోటుచేసుకుంది. మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 27 ఏళ్ల జేక్ పాల్‌తో 58 ఏళ్ల మైక్ టైసన్ తలపడబోతుండటంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. జులై నెలలోనే జరగాల్సి ఉన్న మ్యచ్‌ను టైసన్ అనారోగ్యం కారణంగా ఈ రోజుకి వాయిదా వేశారు.
Next Story






