అలాంటి టైం వేస్ట్ సిరీస్‌లు అవసరమా? రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

by Dishanational5 |
అలాంటి టైం వేస్ట్ సిరీస్‌లు అవసరమా? రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికా పర్యటనలో రెండు టెస్టులే నిర్వహించడంపై టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అతను.. రెండు టెస్టుల సిరీస్‌లతో సమయం వృథా తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించాడు. ఈ సందర్భంగా బీసీసీఐకి కీలక సూచన చేశాడు. ‘భారత్ ఇంకెప్పుడు రెండు టెస్టులు ఆడకుండా బీసీసీఐ చూసుకోవాలి. ఏదైనా దేశం రెండు టెస్టుల సిరీస్ కోసం ఆహ్వానిస్తే ‘మేము రాలేం’ అని చెప్పండి. స్వదేశాల్లోనైనా, విదేశాల్లోనైనా ఇలాంటి సిరీస్‌లతో సమయం వృథా. టీ20 మ్యాచ్‌లు, టెస్టు మ్యాచ్‌లు లేదా వన్డేలు, టెస్టు మ్యాచ్‌లు ఆడటంపై ఫోకస్ పెట్టండి. మూడు టీ20లు, మూడు టెస్టులు సులభంగా ఆడగలరు.’ అని శాస్త్రి చెప్పాడు. కాగా, సౌతాఫ్రికా పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టు సిరీస్‌లను డ్రా చేసుకుంది. తొలి టెస్టులో ఘోర వైఫల్యంతో విమర్శలకు గురైన రోహిత్ సేన.. రెండో టెస్టులో బలంగా పుంజుకుంది. పేసర్లు బుమ్రా, సిరాజ్ విజృంభించడంతో సౌతాఫ్రికాపై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Read More..

చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు.. ఒకేరోజు 19 వికెట్లు



Next Story

Most Viewed