ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు డబుల్ సెంచరీ.. చరిత్రలో మొదటి సారి

by Disha Web |
ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు డబుల్ సెంచరీ.. చరిత్రలో మొదటి సారి
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్-శ్రీలంక మధ్య వెల్లింగ్ టన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ కొనసాగుతుంది. కాగా ఈ మ్యాచ్‌‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఇద్దరు న్యూజిలాండ్ బ్యాటర్స్ డబుల్ సెంచరీ సాధించి రికార్డును నెలకొల్పారు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ 215(296), హెన్రీ నికోల్స్ 200*(240) పరుగులు చేశారు. దీంతో ఓవరాల్ గా ఒకే టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఇద్దరు బ్యాటర్లు డబుల్ సెంచరీలు చేసిన 18వ జోడిగా వీరు నిలిచారు. కాగా ప్రస్తుతం ఈ టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ రెండో రోజు నాలుగు వికెట్లు కోల్పోయి 580 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 17 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది.
Next Story