- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Trending: 4, 4, 3, 1.. మారని టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ల తీరు
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ఘోర పరాజయం పాలైన టీమిండియా సిరీస్‌ను 3-1కోల్పోయింది.

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (Border-Gavaskar Trophy) ఘోర పరాజయం పాలైన టీమిండియా సిరీస్‌ను 3-1కోల్పోయింది. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)కు చేరలేక చతికిలబడిపోయింది. ఈ క్రమంలోనే భారత్ టాపార్డర్ బ్యాట్స్‌మెన్ల ఫామ్ ఇబ్బందులు పడుతోన్న వేళ బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మ్యాచ్ ఆడాలని అనుకున్న ప్రతి ప్లేయర్ రంజీల్లో ఆడాలని షరతు పెట్టంది. అయితే, తాజాగా, దేశ వ్యాప్తంగా రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాల మేరకు భారత స్టార్ క్రికెటర్లు ఫామ్‌ను అందిపుచ్చుకోవడానికి రంజీ బరిలో దిగారు.
విరాట్ కోహ్లీ (Virat Kohli) మినహా.. రోహిత్ శర్మ (Rohith Sharma), రిషభ్ పంత్ (Rishabh Pant), శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), యశస్వి జైశ్వాల్ (Yashaswi Jaiswal), రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లు కూడా రంజీ ఆడారు. అయితే, వాళ్లంతా తమ తొలి మ్యాచ్‌లోనే విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ముంబయి జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ జమ్ము కశ్మీర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో విఫలం అయ్యారు. ఓపెనర్లుగా వచ్చిన జైస్వాల్ కేవలం 4, రోహిత్ శర్మ 3 పరుగుల చేశారు. అదేవిధంగా ముంబై జట్టు కెప్టెన్ అజింక్య రహానె (Ajinkya Rahane) 12, శ్రేయస్ అయ్యర్ (Shreyas Aiyar) 11 పరుగులు చేసి పెవీలియన్ చేరారు. మరోవైపు పంజాబ్ కెప్టెన్‌గా వచ్చిన శుభ్‌మన్ గిల్ 4 పరుగులు, ఢిల్లీ ప్లేయర్ రిషభ్ పంత్ ఒక పరుగు మాత్రమే చేశారు. ఈ క్రమంలో వారి ప్రదర్శన టీమిండియా ఫ్యాన్స్ రాబోయే ఛాంపియ్నస్ ట్రోఫీలో రాణించడం కష్టమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






