- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH: ట్రావిస్ హెడ్ కు కరోనా పాజిటివ్ !
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు ( IPL 2025) మరో టెన్షన్ మొదలైంది. చాలా రోజుల తర్వాత కరోనా మహమ్మారి ( Covid 19) మళ్ళీ తెరపైకి

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ కు ( IPL 2025) మరో టెన్షన్ మొదలైంది. చాలా రోజుల తర్వాత కరోనా మహమ్మారి ( Covid 19) మళ్ళీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ ( SRH) స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ను నిరవధికంగా వాయిదా వేశారు.
ఆ సమయంలో వెంటనే ఆస్ట్రేలియాకు.. హెడ్ ( Travis Head) వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియాలో హెడ్ కరోనా బారిన పడ్డట్లు సమాచారం అందుతోంది. అందుకే అతను తిరిగి ఇండియాకు రాలేదని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో మధ్య తదుపరి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హెడ్ అందుబాటులో ఉండబోడు అని ఇప్పటికే హైదరాబాద్ కోచ్ వెటోరి ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. అయితే సోమవారం సాయంత్రం వరకు ఇండియాకు హెడ్ వస్తారని కూడా చెబుతున్నారు. కోవిడ్ తీవ్రత పెద్దగా లేకపోవడంతో.. తొందరగానే హెడ్ కోలుకున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
🚨 𝑩𝑹𝑬𝑨𝑲𝑰𝑵𝑮 🚨
— Sportskeeda (@Sportskeeda) May 18, 2025
Travis Head likely to miss the clash against LSG as he’s set to arrive in India tomorrow after recently contracting COVID-19. 🤕#IPL2025 #TravisHead #LSGvSRH pic.twitter.com/z53uXtlR1n






