- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB VS PBKS: చిన్నస్వామి స్టేడియంలో అల్లకల్లోలం.. మ్యాచ్ రద్దు ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025 ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (IPL 2025 ) భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇవాళ 34వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే మ్యాచ్ ప్రారంభం కంటే ముందే బెంగళూరు నగరంలో భారీ వర్షం ప్రారంభమైంది.
దీంతో వచ్చిన స్వామి స్టేడియం మొత్తం కవర్స్ తో కప్పారు స్టేడియం నిర్వాహకులు. చిరు జల్లులు పడుతున్న నేపథ్యంలో.. ఏడు గంటలకు వేయాల్సిన టాస్ ప్రక్రియను... అర్ధాంతరంగా నిలిపివేశారు అంపైర్లు. ఇది ఇలా ఉండగా... ప్రస్తుతం చిన్న స్వామి స్టేడియం దగ్గర చిరు జల్లులు మాత్రమే కురుస్తున్నాయని చెబుతున్నారు నిర్వాహకులు. వర్షం తగ్గగానే... కవర్స్ తొలగిస్తామని ప్రకటించారని తెలుస్తోంది. అయితే... ఇవాళ వర్షం పడ్డప్పటికీ... ముందుగా అనుకున్నట్లు 40 ఓవర్లు కచ్చితంగా ఆడిస్తారని సమాచారం. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ... మ్యాచ్ ఓవర్లలో కుదింపు.. ఉండదని నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దీంతో.. స్టేడియానికి వచ్చిన అభిమానులు... సంబరపడిపోతున్నారు. అదే సమయంలో వర్షం తగ్గాలని.. ప్రార్థనలు చేస్తున్నారు.






