ఆ టీమ్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్

by Harish |

టీమ్ ఇండియా యువ బ్యాటర్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఇంగ్లాండ్ జరిగే దేశవాళీ టోర్నీ కౌంటీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఆ టీమ్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా యువ బ్యాటర్, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ ఇంగ్లాండ్ జరిగే దేశవాళీ టోర్నీ కౌంటీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ మేరకు హాంప్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో అతను ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బుధవారం వెల్లడంచింది.‘కౌంటీ చాంపియయన్‌షిప్ లీగ్‌లో ఆడేందుకు తిలక‌ను హాంప్‌షైర్ కౌంటీ సంప్రదించిందని తెలపడానికి సంతోషిస్తున్నాం. తిలక్‌కు శుభాకాంక్షలు’అని హెచ్‌సీఏ పేర్కొంది. కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జూన్, జూలైలో తిలక్ హాంప‌షైర్ తరపున నాలుగు మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ నెల 22న ఎసెక్స్‌తో హాంప్‌షైర్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు తిలక్ ఇంగ్లాండ్‌కు చేరుకుంటాడు. తిలక్ రాక హాంప్‌షైర్ బ్యాటింగ్ బలాన్ని పెంచేదే. మరో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ మంగళవారం యార్క్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరితోపాటు స్పిన్ మాంత్రికుడు యుజువేంద్ర చాహల్ కూడా కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు. నార్తాంప్టన్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు.


Next Story