- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ ‘ఏ’ జట్టుకు కెప్టెన్‌గా తిలక్.. రోహిత్, కోహ్లీలను పక్కనపెట్టిన బీసీసీఐ
ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో భారత యువ బ్యాటర్లు తిలక్ వర్మ, రజత్ పటిదార్‌లు కెప్టెన్లుగా ఎంపికయ్యారు.

దిశ, స్పోర్ట్స్ : త్వరలో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో భారత యువ బ్యాటర్లు తిలక్ వర్మ, రజత్ పటిదార్‌లు కెప్టెన్లుగా ఎంపికయ్యారు. సెప్టెంబర్ 30-అక్టోబర్ 5 వరకు జరిగే వన్డే సిరీస్‌కు బీసీసీఐ ఆదివారం రెండు వేర్వేరు భారత్ ‘ఏ’ జట్లను ప్రకటించింది. తొలి వన్డేకు రజత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రెండు, మూడు వన్డేలకు తిలక్ సారథ్యం వహిస్తాడు. తిలక్‌తోపాటు అభిషేక్ వర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు జట్టులో చోటు దక్కింది. ప్రస్తుతం వీరు ఆసియా కప్ ఆడుతున్నారు. ఈ నెల 28న ఫైనల్ జరగడంతో వన్డే సిరీస్‌కు వీరు అందుబాటులో ఉండనున్నారు.
దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ‘ఏ’ జట్టుకు ఎంపిక చేస్తారని వార్తలు వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ సిరీస్‌ను సన్నాహకంగా ఉపయోగించుకునేందుకు వారిని ఎంపిక చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, రోహిత్, కోహ్లీలను ఎంపిక చేయలేదు. రియాన్ పరాగ్, రవి బిష్ణోయ్‌లతోపాటు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఆయుశ్ బదోని, ప్రియాన్ష్ ఆర్య వంటి ఐపీఎల్ స్టార్లు భారత్ ‘ఏ’ జట్టులో స్థానం సంపాదించారు. ఈ నెల 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. అంతకుముందు ఆస్ట్రేలియా ‘ఏ’తో రెండు మల్డీ డే మ్యాచ్‌లు కూడా ఆడనుంది. ఆ మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఇప్పటికే భారత్ ‘ఏ’ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.






