T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024.. యూఎస్‌ఏలో మూడు వేదికలు ఖరారు

by Disha Web Desk 13 |
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024.. యూఎస్‌ఏలో మూడు వేదికలు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: T20 World Cup 2024 టోర్నీకి వెస్టిండీస్-యూఎస్‌ఏ సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. తాజాగా ICC యూఎస్‌ఏలోని వేదికలను ఖరారు చేసింది. మూడు స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డల్లాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నసౌ కౌంటీ స్టేడియాలను ఐసీసీ ఖరారు చేసింది.

‘‘యూఎస్‌ఏలో మూడు వేదికలను ప్రకటించడం ఆనందంగా ఉంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీలో అమెరికా భాగం కానుంది. వివిధ దశలో దాదాపు 20 దేశాలు కప్‌ కోసం తలపడనున్నాయి. వ్యూహాత్మకంగా క్రికెట్‌ విస్తరణకు యూఎస్‌ఏ అత్యంత కీలకమైంది. ప్రపంచ క్రీడా మార్కెట్‌లో క్రికెట్‌ గొప్ప స్థానానికి చేరే అద్భుత అవకాశం ఇది’’ అని ఐసీసీ సీఈవో జెఫ్‌ అల్డారిస్‌ వెల్లడించారు.


Next Story

Most Viewed