- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mohammed Shami : క్రికెటర్ మహ్మద్ షమీకి బెదిరింపులు
భారత క్రికెటర్, SRH జట్టు కీలక బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami)కి చంపేస్తామని బెదిరింపులు(Threating Mail) రావడం కలకలం రేపుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : భారత క్రికెటర్, SRH జట్టు కీలక బౌలర్ మహ్మద్ షమీ(Mohemmad Shami)కి చంపేస్తామని బెదిరింపులు(Threating Mail) రావడం కలకలం రేపుతోంది. షమీని చంపేస్తామంటూ అతని సోదరుడు హసీబ్ అహ్మద్(Hasib Ahmed) కు మెయిల్స్ చేయడంతో.. హసీబ్ వెంటనే యూపీలోని అమ్రోహా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. అమ్రోహా ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ సెల్ పోలీసులు ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. రాజ్ పుత్ సికిందర్ అనే ఐడీ నుంచి ఈ మెయిల్స్ రాగా.. షమీని చంపేస్తామని, అలా జరగకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు పోలీసులు గుర్తించగా... ఆ ఈమెయిల్ ఎవరు పంపారో కనిపెట్టే పనిలోకి దిగారు.
కాగా షమీకి వచ్చిన ఈ త్రెటెనింగ్ మెయిల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా.. చాలా మంది నెటిజన్స్ షమీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇంతకు ముందు కూడా 2021లో టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఓడినప్పుడు షమీ ఆన్‌లైన్ ట్రోలింగ్, మతపరమైన దూషణలు ఎదుర్కొన్నాడు. తాజా బెదిరింపులు అతని ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాగా నేడు SRH vs DC మ్యాచ్ లో షమీ పాల్గొంటున్నాడు.






