పంజాబ్ జట్టులో ఓ క్రిమినల్ ఉన్నాడు.. యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఐపీఎల్-18 9 (IPL-18) ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే.

పంజాబ్ జట్టులో ఓ క్రిమినల్ ఉన్నాడు.. యోగ్‌రాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-18 9 (IPL-18) ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత తొలిసారి ఆర్సీబీ (RCB) ట్రోఫీని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలోనే టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ (Shreyas Iyer)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ జట్టులో ఒకే ఒక్క క్రిమినల్ ఉన్నాడని అతడే శ్రేయాస్ అయ్యర్ అని కామెంట్ చేశాడు. అతడు అద్భుతంగా ఆడిన ప్రతిసారి పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచిందని.. శ్రేయాస్ అవుట్ అవ్వగానే ఎవరూ అంతగా రాణించకపోవడం వల్లే ఫైనల్ ఓడారని తెలిపారు.

తనకు తెలిసి టీమిండియా (Team India)లో ఇద్దరే గొప్ప ఫినీషర్లు ఉన్నారని.. అందులో ఒకరు మహేంద్ర సింగ్ ధోనీ అయితే ఇంకొకరు యువరాజ్ సింగ్ అని చొప్పుకొచ్చారు. ఇద్దరి గెలుపు శాతం 98 శాతంకి పైగానే ఉందని, ఇక యువరాజ్ సింగ్ 72 మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడని పేర్కొన్నారు. శ్రేయాస్ అద్భుతంగా ఆడి జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడని.. అసలైన మ్యాచ్‌లో చేతులెత్తేయడం తనకు ఎంతగానో కోపం తెప్పించిందని అన్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ చేసింది 40 పరుగులే అయినా అవి ఆ జట్టుకు చాలా ఉపయోగపడ్డాయని యోగ్‌రాజ్ సింగ్ తెలిపారు.

Next Story