- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్..షాకింగ్ లుక్ లో రోహిత్ శర్మ
ధ్య రాంచి వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాంచీ స్టేడియంలో

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కాదు. ఈ రెండు జట్ల మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత జట్టు తరఫున వన్డేలు ఆడేందుకు రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా సిద్ధమవుతున్నారు. టి20 లు, టెస్ట్ క్రికెట్ కు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రతి వన్డేకు భారత జట్టు తరుపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జట్టును ముందుండి నడిపిస్తున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లక్ష్యంగా దూసుకు వెళ్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ ఎప్పుడు ఫిట్ గానే ఉంటాడన్న సంగతి తెలిసిందే.
కానీ అతని కంటే సూపర్ ఫిట్ గా ఇప్పుడు రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు. తనకు ఇష్టమైన వడపావ్, ఇతర ఆహార పదార్థాలను మానేసిన రోహిత్ శర్మ, పూర్తిగా బరువు తగ్గిపోయారు. మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా దాదాపు 15 కిలోలు తగ్గిన రోహిత్ శర్మ, ఇప్పుడు మరో ఐదు కిలోలు తగ్గినట్లు తెలుస్తోంది. భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రాంచి వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా రాంచీ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తూ రోహిత్ శర్మ కనిపించాడు. అయితే ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్ శర్మను ఎవరు గుర్తుపట్టలేకపోయారు.
2014 సమయంలో సన్నగా రోహిత్ శర్మ ఎలా ఉండేవాడో.. ఇప్పుడు కూడా అలాగే మారిపోయాడు. కరెంటు తీగల గ్రౌండ్ లో దూసుకు వెళ్తున్నాడు. ఈ దూకుడు చూస్తుంటే భారత్ కు వన్డే వరల్డ్ కప్ తేవడం గ్యారెంటీ అంటున్నారు ఫ్యాన్స్. ఇది ఇలా ఉండగా ఆస్ట్రేలియా గడ్డపై మొన్న జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. చివరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించి రఫ్పాడించాడు. భయంకరమైన సిక్సర్లు, బౌండర్లతో రెచ్చిపోయాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు దక్షిణాఫ్రికాపై కూడా అలాగే ఆడతాడు అని అంచనా వేస్తున్నారు.






