- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ క్రీడల్లో సత్తాచాటిన తెలంగాణ అమ్మాయి.. కాంస్య పతకం కైవసం
38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి, షూటర్ సురభి భరద్వాజ్ సత్తాచాటింది.

దిశ, స్పోర్ట్స్ : ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ అమ్మాయి, షూటర్ సురభి భరద్వాజ్ సత్తాచాటింది. సోమవారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది. ఫైనల్‌లో ఆమె 448.8 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. స్టార్ షూటర్ సిఫ్ట్ కౌర్(పంజాబ్) 461.2 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం దక్కించుకోగా.. పంజాబ్‌కే చెందిన అంజుమ్(458.7) రజతం సాధించింది. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళా వెయిట్‌లిఫ్టర్ సత్య జ్యోతి కూడా కాంస్యం గెలుచుకుంది. 87+ కేజీల కేటగిరీలో ఆమె స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ విభాగాల్లో కలిపి మొత్తం 194 కిలోలు ఎత్తింది. పంజాబ్‌కు చెందిన మెహక్ శర్మ(247) స్వర్ణం, ఉత్తరాప్రదేశ్‌కు చెందిన పుమిమా పాండే(216) రజతం సాధించారు. మరోవైపు, పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్, స్టార్ షూటర్ సరబ్‌జోత్ సింగ్ పతకం గెలవకపోవడం గమనార్హం. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో పాల్గొన్న అతను 4వ స్థానంతో సరిపెట్టాడు. ఫైనల్‌లో 198.4 స్కోరు చేశాడు. అయితే, కర్ణాటకకు చెందిన 15 ఏళ్ల జోనాథన్ ఆంటోనీ సంచలనం సృష్టించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో నేషనల్ చాంపియన్‌గా నిలిచిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ఫైనల్‌లో అతను 240.7 స్కోరుతో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు.
- Tags
- #national games






