- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీసీఐ నిర్ణయాన్ని సమర్థించిన తెలంగాణ మంత్రి అజారుద్దీన్
బీసీసీఐ నిర్ణయంపై భారత జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ స్పందిస్తూ.. ఈ విషయంలో బోర్డు తప్పేమీ లేదని స్పష్టం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ లో హిందూ మైనార్టీలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో బంగ్లా ప్లేయర్లను ఐపీఎల్ (IPL)లో ఆడనియోద్దని దేశ వ్యాప్తంగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను జట్టు నుంచి తొలగించాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించి.. కేకేఆర్ జట్టుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంపై భారత జట్టు మాజీ కెప్టెన్, తెలంగాన కేబినెట్ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ స్పందించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ విషయంలో బోర్డు తప్పేమీ లేదని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, అయితే క్రీడల విషయానికి వస్తే సమీకరణాలు భిన్నంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన చర్చలు ఉండి ఉంటాయని ఆయన విశ్లేషించారు. ముస్తాఫిజుర్ విడుదల కేవలం క్రికెట్ పరంగా తీసుకున్నది కాదని, దీని వెనుక కేంద్ర ప్రభుత్వ (Central Govt) సంప్రదింపులు ఉన్నాయని అజారుద్దీన్ పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ (MHA), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) వంటి కీలక విభాగాలతో చర్చించిన తర్వాతే బోర్డు ఈ నిర్ణయానికి వచ్చి ఉంటుందని ఆయన తెలిపారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనలను పరిగణనలోకి తీసుకునే ఈ చర్యలు తీసుకున్నట్లు అజారుద్దీన్ వివరించారు. ఈ పరిణామం ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఒక కీలక మలుపుగా మారింది. అలాగే బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ జట్టు ముస్తఫిజుర్ రెహమాన్ ను తమ టీమ్ నుంచి రిలీవ్ చేసింది.






