- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో పతకం.. 100 మీటర్ల రేసులో రజతం గెలిచిన నిత్య
ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో పతకం దక్కింది.

దిశ, స్పోర్ట్స్ : ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణకు మరో పతకం దక్కింది. మహిళా స్ప్రింటర్ గందె నిత్య 100 మీటర్ల రేసులో రజత పతకం దక్కించుకుంది. శనివారం జరిగిన ఈవెంట్‌లో ఆమె 11.79 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచింది. అయితే, నిత్య తృటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. మహారాష్ట్రకు చెందిన సుదేష్న శివంకర్ 11.76 సెకన్లతో గోల్డ్ మెడల్ సాధించింది. తమిళనాడు అథ్లెట్ గిరిధరణి(11.88 సెకన్లు) కాంస్యం గెలుచుకుంది. పతకాల పట్టికలో తెలంగాణ 7 పతకాలతో 29వ స్థానంలో ఉన్నది. ఓ స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్య పతకాలు తెలంగాణ ఖాతాలో ఉన్నాయి. సర్వీస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు 71 పతకాలతో మెడల్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
ఏసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు సావన్ బర్వాల్ అర్హత
లాంగ్ డిస్టేన్స్ రన్నర్, హిమాచల్‌ప్రదేశ్ అథ్లెట్ సావన్ బర్వాల్ 10,000 మీటర్ల రేసులో గోల్డ్ మెడల్ సాధించాడు. 28.49.93 సెకన్లలో అతను రేసును పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో బర్వాల్ మేలో జరగబోయే ఏసియన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు.
- Tags
- #national games






