- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 72 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యచేధనలో జింబాబ్వే చివరి వరకూ పోరాటం చేసిన ఫలితం లేకుండా పోయింది. మొత్తంగా 20 ఓవర్లు ఆడిన జింబాబ్వే 6 వికెట్లు నష్టపోయి 184 పరుగులకే పరిమితం అయింది. జింబాబ్వే బ్యాటర్లలో బెనెట్ (97) అద్భుతంగా రాణించారు. కెప్టెన్ సికిందర్ రజా (31), మారుమణి(20) కూడా పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. సంజూ శాంసన్ (24), అభిషేక్ శర్మ(55) అదిరిపోయే ఆరంభం అందించారు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (38), సూర్యకుమార్ యాదవ్ (33), హార్దిక్ పాండ్యా (50), తిలక్ వర్మ (44) సిక్సర్లతో చెలరేగడంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో రిచార్డ్, బ్లెస్సింగ్, మోపాసా, సికిందర్ రజా తలో వికెట్ తీశారు. సూపర్-8లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ జింబాబ్వే ఓడిపోవడంతో టోర్ననుంచి నిష్క్రమించనుంది. నెక్ట్స్ వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సెమీస్ బెర్త్ ఖరారు అవుతుంది.






