బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..బంగ్లా టూర్ కు భార‌త జ‌ట్టు?

by velandi.Saikiran |

త్వ‌రలోనే బంగ్లాదేశ్ కు భారత జట్టు ప‌యనం కానుంద‌ట‌. ఈ సంద‌ర్భంగా మూడు వన్డేలతో పాటు మూడు టీ20లు రెండు జట్ల మధ్య జరుగుతాయని స‌మాచారం.

బీసీసీఐ సంచ‌ల‌న నిర్ణ‌యం..బంగ్లా టూర్ కు భార‌త జ‌ట్టు?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ పై కీలక అప్డేట్ వచ్చింది. 2025 లోనే ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన టోర్నమెంట్ ఈ ఏడాది జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో బంగ్లాదేశ్ లో భారత జట్టు పర్యటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పోస్ట్ పోన్ అయిన పర్యటనను ఇప్పుడు రీ-షెడ్యూల్ చేయబోతున్నారట. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ కు చెందిన ఓ అధికారి వెల్లడించినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఆగస్టు 28వ తేదీన బంగ్లాదేశ్ కు భారత జట్టు చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారట. ఈ నేపథ్యంలోనే మూడు వన్డేలతో పాటు మూడు టీ20లు రెండు జట్ల మధ్య జరుగుతాయని ఆ అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు బీసీసీఐ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. ఈ అల్లర్ల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నమెంట్ లో బంగ్లాదేశ్ ప్లేయర్లను కూడా ఆడించకూడదని ఇండియన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Next Story