- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి వాయిదా... ఎందుకంటే..?
టీమిండియా(Team India) యువ ఆటగాడు రింకూ సింగ్(Rinku Singh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) యువ ఆటగాడు రింకూ సింగ్(Rinku Singh) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో తనదైన పాత్ర పోషించాడు. ఇటీవలే రింకూకు పెళ్లి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. లక్నోలో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. అయితే.. ఈ ఏడాది నవంబర్ 19న వివాహం కావాల్సి ఉంది. మరోవైపు.. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు భారత జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. సౌతాఫ్రికాకు వెళ్లబోయే జట్టులో రింకూ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే పెళ్లిని వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేసినట్లు సమాచారం. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌ను రింకు సింగ్ వివాహం చేసుకోబోతున్నారు. 27 ఏళ్ల రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టులో కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు.
రింకూ నిశ్చితార్థానికి మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా, ఉత్తరప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ హాజరయ్యారు. రాజకీయ ప్రముఖులలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎంపీ డింపుల్ యాదవ్, ప్రియా సరోజ్‌కు సన్నిహితురాలైన మరో పార్లమెంటేరియన్ ఇక్ర హసన్, సీనియర్ సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా కూడా వచ్చారు.






