అంత యాటిట్యూడ్ ఎందుకు బ్రో.. అమ్మాయి పరుగులు తీస్తున్నా కనికరించవా?.. టీమిండియా ప్లేయర్‌ గిల్‌పై విమర్శలు

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అంత యాటిట్యూడ్ ఎందుకు బ్రో.. అమ్మాయి పరుగులు తీస్తున్నా కనికరించవా?.. టీమిండియా ప్లేయర్‌ గిల్‌పై విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌(Shubman Gill)పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అమ్మాయిల పట్ల అతని వైఖరి అస్సలు బాగోలేదని నెటిజన్లు తెగ మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఎయిర్‌పోర్ట్‌లో తనకు మీతో ఒక సెల్ఫీ కావాలని ఓ మహిళా అభిమాని గిల్‌ను రిక్వెస్ట్ చేసింది. కానీ.. గిల్ మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. అతనికి సరిగా వినబడలేదేమో అని భావించిన సదరు మహిళా అభిమాని.. సెల్ఫీ(Selfie) ప్లీజ్ అంటూ అతని వెంట పరుగులు తీసినా కనికరించలేదు. కనీసం ఆమె వైపు కూడా చూడులేదు. ఇదంతా అక్కడే కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది కాస్త వైరల్ కావడంతో నెటిజన్లు గిల్‌పై ఫైర్ అవుతున్నారు. ‘అంత యాటిట్యూడ్ ఎందుకు బ్రో.. అమ్మాయి పరుగులు తీస్తున్నా కనికరించవా?’ అంటూ పోస్టులు పెడుతూ సీరియస్ అవుతున్నారు. సచిన్, ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలే దగ్గరకు వెళ్లి మరీ మహిళలకు ఫొటో ఇచ్చి గౌరవిస్తారు. నువ్వు వారి కంటే గొప్పోడివా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, ఐపీఎల్‌(IPL 2025)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన గుజరాత్ జట్టు.. మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. మిగిలిన ఎనిమిది మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం టేబుల్ టాప్‌లో గుజరాత్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో గిల్ కూడా బాగానే రాణిస్తున్నారు. మొత్తం మ్యాచుల్లో 508 పరుగులు చేశాడు.

Next Story