- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాకు భారీ షాక్.. టీ20 సిరీస్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్?
మూడో టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేయడంతో భారత్ టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : మూడో టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేయడంతో భారత్ టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో సాధించింది. అయితే, నాలుగో టీ20కి ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలినట్టు తెలుస్తోంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మిగతా సిరీస్ నుంచి తప్పుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అస్వస్థత కారణంగా అతను ఆదివారం జరిగిన మూడో టీ20 ఆడలేదు. దీనిపై బీసీసీఐ కూడా స్పష్టమైన కారణం చెప్పలేదు. అతని స్థానంలో కుల్దీప్ తుది జట్టులోకి వచ్చాడు. అస్వస్థతతో మిగతా రెండు మ్యాచ్‌లకు కూడా అక్షర్ అందుబాటులో ఉండటం లేదని సమాచారం. దీనిపై బీసీసీఐ క్లారిటీ ఇస్తేనే అసలు విషయం తెలుస్తోంది. తొలి రెండు టీ20లు ఆడిన అతను 23, 21 పరుగులు చేశాడు. అలాగే, 3 వికెట్లు తీశాడు. అలాగే, వ్యక్తిగత కారణాలతో ఇంటికి వెళ్లిన భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా కూడా మిగతా రెండు మ్యాచ్‌లు ఆడతాడా?లేదా?అన్నది సందిగ్ధమే.






