- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCupFinal: టాస్ ఓడిపోయిన భారత జట్టు
టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. కాసేపట్లో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. కాసేపట్లో గుజరాత్‌లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయబోతున్నది.
భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు 30 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాయి. వీటిలో 18 మ్యాచ్‌లలో భారత్ విజయం సాధించగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై అయింది. సూపర్ ఓవర్లలో భారత్ రెండు మ్యాచ్‌లలో గెలిచింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ టై అయింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన 16 మ్యాచ్‌లలో భారత్ 11 మ్యాచ్‌లలో గెలిచింది.
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా మరియు అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్ జట్టు: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అల్లెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), కోల్ మెక్కాంచీ, మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్.






