పాకిస్థాన్ పై విజ‌యం...సూర్య కుమార్ వివాద‌స్ప‌ద పోస్ట్‌

by velandi.Saikiran |

పాకిస్థాన్ పై విజ‌యం...సూర్య కుమార్ వివాద‌స్ప‌ద పోస్ట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్న‌మెంట్ లో(Asia Cup 2025 ) భాగంగా...పాకిస్థాన్ పై టీమిండియా విజ‌యం సాధించింది. ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ కొట్టింది సూర్య భాయ్ జ‌ట్టు. అయితే.. ఈ మ్యాచ్ విజ‌యం అనంత‌రం కెప్టెన్ సూర్యకుమార్ ( Surya Kumar Yadav) సంచ‌ల‌న‌ పోస్ట్ పెట్టారు. ఈ విజయం పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. పహల్గామ్ సంఘ‌ట‌న జ‌రుగ‌డం బాధ‌క‌ర‌మ‌ని తెలిపారు. వాళ్ల ప్రాణాలు తీసుకురాలేమ‌ని చెప్పారు.

అందుకే పాకిస్థాన‌పై విజ‌యం... పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం చేస్తున్న‌ట్లు పోస్టు పెట్ట‌డ‌మే కాకుండా.... ప్రెస్ మీట్ లో వెల్ల‌డించారు సూర్య‌. ఇది ఇలా ఉండ‌గా.... ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా.. సూప‌ర్ 4 బెర్త్ ఖ‌రారు చేసుకుంది. 47 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందించారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మ్యాచ్‌ ముగిసిన వెంటనే పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా.. సూర్యకుమార్, శివమ్ దూబే నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు వెళ్లి...సంచ‌ల‌నానికి తెర‌లేపారు. దీంతో.. ఇప్పుడు షేక్ హ్యాండ్స్ వివాదం ముదురుతోంది. క్లిక్

Next Story