హాస్పిటల్‌లో చేరిన సూర్యకుమార్.. అతనికి ఏమైంది?

by Harish |

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ జరిగింది.

హాస్పిటల్‌లో చేరిన సూర్యకుమార్.. అతనికి ఏమైంది?
X

దిశ, స్పోర్ట్స్ : టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ జరిగింది. కొంతకాలంగా స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్న అతను జర్మనీలోని మ్యూనిచ్‌లో ఆపరేషన్ చేయించుకున్నాడు. సూర్య పొత్తికడుపులో కుడివైపున స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల సర్జరీ కోసం జర్మనీ వెళ్లాడు. శస్త్రచికిత్స విషయాన్ని సూర్య ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పాడు. ‘కుడివైపు పొత్తికడుపు ప్రాంతంలో స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ జరిగింది. ప్రస్తుతం కోలుకుంటున్నా. త్వరలోనే మైదానంలోకి వస్తా.’అని సూర్య ఇన్‌స్టాలో తెలిపాడు.

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ టూరులో ఉంది. ఈ పర్యటన తర్వాత ఆగస్టులో వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బంగ్లాదేశ్‌కు వెళ్లనుంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత సూర్య 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడలేదు. కాబట్టి, ఆగస్టు 26 నుంచి ప్రారంభమయ్యే మూడు టీ20ల సిరీస్‌కు అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్పటికి అతను ఫిట్‌నెస్ సాధించాల్సి ఉంది. సర్జరీ నుంచి కోలుకోవడానికి సూర్య చేతుల్లో దాదాపు రెండు నెలల సమయం ఉంది. త్వరలోనే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో రిహాబిలిటేషన్ ప్రారంభించనున్నాడు. ఇటీవల ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స‌కు చేరడంలో సూర్య కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 717 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ టోర్నీగా నిలిచాడు.


Next Story