పల్టీలు కొట్టి సిక్స్ కొట్టిన సూర్య... బ్యాట్ ఎగిరిపోయింది

by velandi.Saikiran |   (  Updated:2025-05-02 02:13:40  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar

పల్టీలు కొట్టి సిక్స్ కొట్టిన సూర్య... బ్యాట్ ఎగిరిపోయింది
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో.. ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ ( Surya Kumar Yadav).. అదిరిపోయే షాట్ కొట్టాడు. రాజస్థాన్ ( RR) బౌలర్ వేసిన బంతిని... వికెట్ కీపర్ వెనుక నుంచి కొట్టే ప్రయత్నం చేశాడు సూర్య కుమార్ యాదవ్. ఈ నేపథ్యంలోనే... వికెట్లు వదిలి, ఆఫ్ సైడ్ వచ్చి.. మరి షాట్ కొట్టాడు. ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కొట్టి... కింద పడిపోయాడు సూర్య కుమార్ యాదవ్. ఈ సంఘటన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి... మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది.

నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు నష్టపోయి... 217 పరుగులు చేసింది ముంబై ఇండియన్స్. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 23 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లతో పాటు నాలుగు బౌండరీలు ఉన్నాయి. 208 స్ట్రైక్ రేట్ తో దుమ్ము లేపాడు సూర్య కుమార్ యాదవ్. అయితే ఈ మ్యాచ్ చివరలో వికెట్ పైనుంచి షాట్ కొట్టే ప్రయత్నం చేసి... పల్టీలు కొట్టాడు సూర్య కుమార్ యాదవ్. అతడు పడడమే కాకుండా బ్యాట్ కూడా... గిర్రున ఎగిరి పడింది. దీనికి సంబంధించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు నవ్వుకుంటున్నారు.

Click For Tweet..

Next Story