- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH ఫ్యాన్స్ కు రిలీఫ్..కాటేరమ్మ కొడుకు రిటైన్ !

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ను SRH యాజమాన్యం రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తలన్నీ ఫేక్ అని తెలుస్తోంది. రిటైన్ లిస్టులో కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసెన్ పేరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
హెన్రిచ్ క్లాసెన్ ను వదులుకునేది లేదని హైదరాబాద్ యాజమాన్యం డిసైడ్ అయిందట. అయితే, మహమ్మద్ షమీని ట్రేడ్ ద్వారా లక్నోకు ఇచ్చేందుకు సిద్ధమైందట హైదరాబాద్. అతని స్థానంలో లక్నోకు చెందిన మరో బౌలర్ ను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇశాన్ కిషన్, అభినవ్ మనోహర్, రాహుల్ చాహర్, ఎషాన్ మలింగ లాంటి ప్లేయర్లను రిలీజ్ చేయనుందట సన్‌రైజర్స్ హైదరాబాద్. కాగా రేపు రిటైన్షన్ ప్రక్రియకు చివరి రోజు. డిసెంబర్ 15న అబుదాబీలో మినీ వేలం జరుగనుంది.






