SRH vs RR : తొలి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ

by Muthe.Rajitha |   (  Updated:2025-03-23 14:16:55  IST  )

ఐపీఎల్ 2025(IPL 2025)లో సన్ రైజర్స్(SRH) ఖాతా తెరిచింది.

SRH vs RR : తొలి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో సన్ రైజర్స్(SRH) ఖాతా తెరిచింది. తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్(RR) ను చిత్తు చేస్తూ 44 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్- రాజస్థాన్ రాయల్స్(SRH-RR) మధ్య ఐపీఎల్ 2025 మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో జరిగిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(Ishan Kishan) 107 పరుగులు చేసి.. జట్టును భారీ స్కోర్ దిశగా నడిపించాడు.

హెడ్ కూడా భారీ ఫోర్లు, సిక్సులతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం 287 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. రాజస్థాన్ జట్టులో జురేల్ 70, సంజు 66 పరుగులు చేసినా.. ఆరెంజ్ జట్టు కట్టుదిట్టమైన ఫీల్డింగ్, బౌలింగ్ తో లక్ష్యాన్ని చేరలేకపోయారు. SRH జట్టులో హర్షల్, సమర్జిత్ తలా రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్ హైలెట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Next Story