విధ్వంసం సృష్టించిన కేకేఆర్ స్టార్ స్పిన్నర్.. 7 ఓవర్లలో 7 వికెట్లు.. అన్నీ మెయిడీన్లే..

by Disha Web Desk 13 |
విధ్వంసం సృష్టించిన కేకేఆర్ స్టార్ స్పిన్నర్.. 7 ఓవర్లలో 7 వికెట్లు.. అన్నీ మెయిడీన్లే..
X

దిశ, వెబ్‌డెస్క్: ట్రినిడాడ్ అండ్ టోబాగో క్రికెట్ బోర్డు నిర్వహించిన టోర్నీలో కేకేఆర్ స్టార్ బౌలర్ సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. క్వీన్స్ పార్క్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్న సునీల్ నరైన్ అద్భుత ప్రదర్శన చేశాడు. క్లార్క్ రోడ్ యునైటెడ్ జట్టుపై 7 ఓవర్లలో పరుగులేమీ ఇవ్వకుండా 7 మెయిడిన్లుతో 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు క్లార్క్ రోడ్ యునైటెడ్‌ కేవలం 76 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో మెుదట బ్యాటింగ్ చేసిన క్విన్స్ పార్క్ 50 ఓవర్లలో 268 రన్స్ చేయగా.. ప్రత్యర్థి జట్టు కేవలం 76 రన్స్‌కు అలౌటయింది. సునీల్ నరైన్ ఐపీఎల్ కెరీర్‌లో అతను ఇప్పటివరకు 148 మ్యాచ్‌లు ఆడగా.. 152 వికెట్లు తీశాడు. అలాగే ఈ బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన ఘనతను 7 సార్లు చేశాడు.

Next Story

Most Viewed