రోహిత్ సీటులో కూర్చుంటోంది ఎవరు? వెల్లడించిన స్టార్ స్పిన్నర్

by Phanindra |

టీమిండియా బస్సులో రోహిత్ సీటులో కూర్చుంటోంది ఎవరు? ఈ విషయాన్ని స్టార్ స్పిన్నర్ వెల్లడించాడు.

రోహిత్ సీటులో కూర్చుంటోంది ఎవరు? వెల్లడించిన స్టార్ స్పిన్నర్
X

దిశ, స్పోర్ట్స్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత.. టీం బస్సులో అతని ప్లేస్‌లో ఎవరు కూర్చుంటున్నారు? ఈ ప్రశ్నకు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సమాధానం ఇచ్చాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన కుల్దీప్.. తాజాగా టీం బస్సులో స్థానాల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘రోహిత్ సీటులో నేనే కూర్చుంటున్నా. అంటే నేను తన రిప్లేస్‌మెంట్ అని కాదు. ఆ సీటు పక్కనే జడేజా కూర్చుంటాడు. సాటి స్పిన్నర్‌గా తనతో నేను చాలా విషయాలు చర్చిస్తాను. అందుకే రోహిత్ సీటులో కూర్చుంటున్నా. గతంలో అశ్విన్ పక్కన కూర్చొని బౌలింగ్ గురించి మాట్లాడేవాడిని. ఇప్పుడు అశ్విన్ కూడా లేడు కదా. ఇప్పుడు జడ్డూ భాయ్‌తోనే నా స్పిన్ ముచ్చట్లు. తను నా స్పిన్ పార్టనర్‌గా ఉండటం నిజంగా నా అదృష్టం’ అని కుల్దీప్ చెప్పుకొచ్చాడు.

Next Story