- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలంక జట్టులో పెను విషాదం...సూపర్ 4 లోకి వచ్చిన సంతోషం లేకుండానే
శ్రీలంక జట్టులో పెను విషాదం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే తండ్రి మరణించారు

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... శ్రీలంక జట్టులో పెను విషాదం చోటుచేసుకుంది. నిన్న అర్ధరాత్రి శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే తండ్రి మరణించారు. నిన్నటి రోజున ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన శ్రీలంక 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన శ్రీలంక నేరుగా సూపర్ ఫోర్ లోకి దూసుకు వెళ్ళింది. ఇక రేపటి నుంచి సూపర్ ఫోర్ రేస్ ప్రారంభమవుతుంది.
అయితే ఈ సంతోషంలో ఉన్న శ్రీలంక జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు బౌలర్ దునిత్ వెల్లలాగే తండ్రి సురంగ గుండెపోటుతో కొలంబోలో మరణించారు. ఈ మేరకు దునిత్ వెల్లలాగేకు శ్రీలంక మేనేజర్ సమాచారం అందించారు. మ్యాచ్ మధ్యలోనే ఈ విషయం శ్రీలంక మేనేజ్మెంట్ కు తెలిసినప్పటికీ... మ్యాచ్ విజయం సాధించిన తర్వాత సమాచారం అందించారు.
దీంతో అతని గుండె పగిలినట్లు అయింది. వెంటనే దునిత్ వెల్లలాగే కన్నీళ్లు పెట్టుకున్నాడట. అటు శ్రీలంక ప్లేయర్లు అతన్ని ఓదార్చారు. అయితే దునిత్ వెల్లలాగే తండ్రి మృతి నేపథ్యంలో సూపర్ ఫోర్ కు అతను దూరం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న ఇతని బౌలింగ్ లోనే నబి వరుసగా 5 సిక్సర్లు కొట్టి చుక్కలు చూపించాడు. క్లిక్






