- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
T20WorldCup2026: కీలక మ్యాచ్‌లో టాస్ ఓడిన పాకిస్తాన్
టీ20 ప్రపంచకప్, సూపర్-8లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరుగబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: టీ20 ప్రపంచకప్(T20 World Cup 2026), సూపర్-8లో భాగంగా నేడు మరో కీలక మ్యాచ్ జరుగబోతోంది. పల్లకీల మైదానం వేదికగా పాకిస్తాన్, శ్రీలంక(Pakistan vs Sri Lanka) జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే టోర్నమెంట్ నుంచి శ్రీలంక నిష్ర్కమించింది. పాకిస్తాన్ సెమీస్‌కు వెళ్తుందా? లేదా? అనేది ఈ మ్యాచ్ నిర్ణయిస్తుంది. దీంతో ఎలాగైనా భారీ విజయం సాధించాలని పాక్ ప్లేయర్లు తహతహలాడుతున్నారు. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నది.
పాకిస్తాన్: సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), ఖవాజా నఫే, ఉస్మాన్ ఖాన్(వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార(వికెట్ కీపర్), చరిత్ అసలంక, పవన్ రత్నాయకే, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), జనిత్ లియానాగే, దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక.






