- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ఇద్దరినీ వదిలేసి.. కొత్త అమ్మాయితో తిరుగుతున్న టీమిండియా ఆల్ రౌండర్!
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా... మోడల్ మాహికా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు తెరపైకి కొత్త అంశం వచ్చింది

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా... మోడల్ మాహికా శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు తెరపైకి కొత్త అంశం వచ్చింది. వివరాల్లోకి వెళితే.... హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇతడు తనదైన ఆట తీరుతో క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను టీమిండియాకు అందించాడు. ఇక హార్దిక్ పాండ్య వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే అతడు తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నారు.
విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా బ్రిటిష్ సింగర్ జాస్మిన్ తో డేటింగ్ చేసినట్లు అనేక రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈమె మాత్రమే కాకుండా చాలామంది హీరోయిన్లతో హార్దిక్ పాండ్యా డేటింగ్ చేశారంటూ, వివాహం కూడా చేసుకోబోతున్నారంటూ కొన్ని రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా హార్దిక్ పాండ్యా మోడల్ మహిక శర్మతో డేటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
వీరిద్దరూ గత కొద్దిరోజుల నుంచి కలిసి ఉంటున్నారంటూ ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా మాహిక శర్మ చేతిపై హార్దిక్ పాండ్యా జెర్సీ నెంబర్(33) కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మాహికా శర్మ చేతిపై హార్దిక్ పాండ్యా జెర్సీ నెంబర్ కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని క్లారిటీ వచ్చేసింది. ఈ విషయం పైన హార్దిక్ పాండ్యా ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.






