WTC Final 2025: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్కరమ్ సెంచరీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-13 17:01:24  IST  )

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్ సౌతాఫ్రికా(South Africa) స్టార్ ప్లేయర్ మార్కరమ్(Aiden Markram) అదరగొట్టారు.

WTC Final 2025: సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్కరమ్ సెంచరీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్ సౌతాఫ్రికా(South Africa) స్టార్ ప్లేయర్ మార్కరమ్(Aiden Markram) అదరగొట్టారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో జట్టును ఆదుకోవడమే గాకుండా సెంచరీతో సత్తా చాటారు. ఈ మ్యాచ్‌లో 156 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్ 102 పరుగులు చేశారు. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు సఫారీ జట్టు కెప్టెన్ టెంబ బవూమా కూడా రాణించారు. 117 బంతులు ఎదుర్కొన్న బవూమా 62 పరుగులు చేశారు. ఇందులో ఐదు ఫోర్లు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు రెండు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా 210 పరుగులు చేసింది. విశ్వవిజేతగా నిలవాలంటే మరో 72 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story