WTC final: పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా... హెడ్ మరీ దారుణం !

by velandi.Saikiran |   (  Updated:2025-06-11 13:38:18  IST  )

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ (WTC 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా పై కంగారులు

WTC final: పీకల్లోతు కష్టాల్లో ఆస్ట్రేలియా... హెడ్ మరీ దారుణం !
X

దిశ, వెబ్ డెస్క్: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 ఫైనల్ మ్యాచ్ (WTC 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. దక్షిణాఫ్రికా పై కంగారులు రెచ్చిపోతారు అనుకుంటే... సీన్ మొత్తం రివర్స్ అయింది. 100 పరుగులు చేయకముందే సగం వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదురోజుల పాటు సాగే ఈ మ్యాచ్ లో మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసింది.

ఈ నేపథ్యంలోనే... ఆస్ట్రేలియా బ్యాటర్లను సఫారీలు... కంగారు పెట్టించారు. రబాడ, మార్కో జాన్సన్ ఇద్దరు అదిరిపోయే బౌలింగ్ చేయడంతో... నాలుగు వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. మొదటిరోజు లంచ్ సమయం కంటే ముందే... కీలక నాలుగు వికెట్లు పడిపోయాయి.

అయితే కష్టాల్లో ఉన్న ఆస్ట్రేలియా జట్టును మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ ఆదుకుంటున్నాడు. ప్రస్తుతం 106 బంతుల్లో 65 పరుగులతో రాణిస్తున్నాడు స్మిత్. అలాగే వెబ్ స్టార్ 48 బంతుల్లో 34 పరుగులు చేసి బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతకుముందు ఉస్మాన్ ఖవజా 0, మార్కస్ లబుశాంగే 17 పరుగులు, కెమెరన్ గ్రీన్ నాలుగు పరుగులు, డేంజరస్ హెడ్ 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు రబాడ, జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Next Story