- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ గవర్నింగ్ బాడీ ఆదివారం వెల్లడించింది. మరో భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరిగి ప్యానెల్ మెంబర్‌గా చేరాడు. గంగూలీ, లక్ష్మణ్‌తోపాటు అఫ్గానిస్తాన్ మాజీ ప్లేయర్ హమిద్ హసన్, వెస్టిండీస్ బ్యాటింగ్ దగ్గజం డెస్మండ్ హేన్స్, సౌతాప్రికా కెప్టెన్ టెంబా బావుమా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోనాథన్ ట్రాట్ కమిటీలో ఉన్నారు. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చేసిన సిఫార్స్‌లను ఐసీసీ గవర్నింగ్ బాడీ ఆమోదించింది. గంగూలీ తొలిసారిగా 2021లో క్రికెట్ కమిటీ చైర్మన్‌గా నియామకమయ్యాడు.అనిల్ కుంబ్లే నుంచి బాధ్యతలు చేపట్టాడు. గంగూలీ మరో మూడేళ్లు ఆ పదవిలో కొనసాగనున్నాడు.
Next Story






