శ్రేయాస్ అయ్యర్ కు అన్యాయం.. బీసీసీఐపై దాదా సీరియస్

by velandi.Saikiran |

ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( England vs Team India) మధ్య జరగబోతున్న ఐదు టెస్టుల సిరీస్ కు ( Test series) పంజాబ్ కింగ

శ్రేయాస్ అయ్యర్ కు అన్యాయం.. బీసీసీఐపై దాదా సీరియస్
X

దిశ, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( England vs Team India) మధ్య జరగబోతున్న ఐదు టెస్టుల సిరీస్ కు ( Test series) పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ను (Shreyas Iyer ) ఎందుకు సెలెక్ట్ చేయలేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి పై ( BCCI) ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సౌరవ్ గంగూలీ ( Sourav Ganguly). టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జూన్ 20వ తేదీ నుంచి ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్న టీమిండియా... ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది. గిల్ (Gill) కెప్టెన్సీలో బరిలోకి దిగబోతుంది టీమిండియా. ఇలాంటి నేపథ్యంలో తాజాగా ఐదు టెస్టుల సిరీస్ పై సౌరవ్ గంగూలీ మాట్లాడారు.

ఈ ఐదు టెస్టుల సిరీస్ కోసం... శ్రేయాస్ అయ్యర్ ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుండేది అన్నారు. గత ఏడాది కాలం నుంచి అతను అద్భుతంగా రాణిస్తున్నాడని..శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గంగూలీ వివరించారు. ముఖ్యంగా షార్ట్ బాల్స్... ఎదుర్కోవడంలో శ్రేయాస్ అయ్యర్ మొనగాడని కితాబిచ్చారు. టెస్ట్ క్రికెట్ భిన్నమైన ఫార్మాట్ అయినప్పటికీ... శ్రేయాస్ అయ్యర్ కు అవకాశం ఇస్తే బాగుండేది అన్నారు. విరాట్ కోహ్లీ ( Virat Kohli) లేని లోటు... శ్రేయాస్ అయ్యర్ మాత్రమే తీర్చుతాడని... అభిప్రాయపడ్డారు భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ.

Next Story