పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు.. గంగూలీ కీలక వ్యాఖ్యలు

by Harish |

పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు.

పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దు.. గంగూలీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడొద్దని వ్యాఖ్యానించాడు. కోల్‌కతాలో గంగూలీ మీడియాతో మాట్లాడుతూ..‘100 శాతం అంగీకరిస్తా. పాకిస్తాన్‌తో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలి. ఇది జరిగి తీరాలి. కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉండటం జోక్ కాదు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదు.’ అని తెలిపాడు. 2013 నుంచి భారత్, పాక్ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లలో పాల్గొనడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లలో మాత్రమే తలపడుతున్నాయి. ఇరు జట్ల మధ్య ఫైట్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయా టోర్నీల్లో రెండు జట్లను ఒకే గ్రూపులో చేర్చుతున్నారు. అయితే, పహల్గాం ఘటన తర్వాత ఇక ఐసీసీ టోర్నీలలొ భారత్, పాక్ జట్లను ఒకే గ్రూపులో చేర్చొద్దని బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి.


Next Story