SRH మ్యాచ్... ఆ హీరో, హీరోయిన్ మధ్య వార్ మాములుగా లేదుగా !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ రాత్రి కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ స

SRH మ్యాచ్... ఆ హీరో, హీరోయిన్ మధ్య వార్ మాములుగా లేదుగా !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) భాగంగా ఇవాళ రాత్రి కీలక మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ( Punjab Kings vs Sunrisers Hyderabad) జట్ల మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో... ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ నేపథ్యంలో.. టాలీవుడ్ వెంకీ మామ ( Venky Mama), అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా ( Preity Zinta ) మధ్య సోషల్ మీడియాలో వారు కొనసాగుతోంది. హైదరాబాద్ జట్టుకు వెంకీ మామ.. సపోర్ట్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ జట్టు ఎక్కడ ఆడినా కూడా కచ్చితంగా స్టేడియానికి వెళ్లి మ్యాచ్ తిలకిస్తాడు విక్టరీ వెంకటేష్. అయితే పంజాబ్ కింగ్స్ కో ఓనర్ గా ప్రీతి జింటా కొనసాగుతున్నారు.

దీంతో పంజాబ్ కింగ్స్ ఇవాళ గెలిచేలా ప్రత్యేక పూజలు కూడా హైదరాబాద్ లో చేశారు ప్రీతి జింటా. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో కలిసి నటించిన ప్రీతి జింటా అలాగే విక్టరీ వెంకటేష్ ఇద్దరూ.. ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అప్పుడు జంటగా నటించి రొమాన్స్ చేశారని.. ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారి... ఉప్పల్లో మ్యాచ్ చూడబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా... విక్టరీ వెంకటేష్ అలాగే ప్రీతి జింటా ఇద్దరి కాంబినేషన్ లో ప్రేమంటే ఇదేరా ( Premante Idera) అనే సినిమా వచ్చి గ్రాండ్ సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.


Next Story