- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shubman Gill : టీమిండియా కెప్టెన్ గిల్ కు నేడు ఈ పరీక్ష..!
సాయి సుదర్శన్ తుది జట్టులో ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా భారత్ వర్సెస్

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రేపటి నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ గిల్ ఫిట్నెస్ పరీక్షను ఎదుర్కోబోతున్నాడట. ఇవాళ గిల్ ఫిట్నెస్ టెస్ట్ కు వెళ్లనున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్ నుంచి టీమిండియాతో పాటే గువాహటి వెళ్లాడు గిల్. కానీ నిన్న ప్రాక్టీస్ కు మాత్రం గిల్ హాజరు కాలేదు. దీంతో రెండో టెస్టుకు గిల్ దూరమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
గిల్ త్వరగానే కోలుకుంటున్నట్లు అటు టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. ఇవాళ సాయంత్రం ఫిజియోలు, డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా గిల్ రెండో టెస్ట్ ఆడడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. డాక్టర్లు ఓకే చెబితే, రెండో టెస్టుకు రెడీగా ఉంటాడని వివరించారు. ఒకవేళ గిల్ ఆడక పోతే అతని స్థానంలో సాయి సుదర్శన్ తుది జట్టులో ఉంటాడని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మొదటి టెస్ట్ సందర్భంగా గిల్ మెడనొప్పి బారిన పడ్డాడు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి మూడు రోజుల పాటు చికిత్స కూడా తీసుకున్నాడు.






