- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH చేతిలో చెన్నై చిత్తు.. హీరోయిన్ కన్నీళ్లు
ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై ( CSK ) వర్సెస్ హైదరాబాద్ ( SRH) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ లో భాగంగా నిన్న చెన్నై ( CSK ) వర్సెస్ హైదరాబాద్ ( SRH) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. చెన్నై స్టేడియంలో హైదరాబాద్ కు ఇదే తొలి విక్టరీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు... హైదరాబాద్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై ఓడిపోవటాన్ని.. భరించలేక చాలామంది ఎమోషనల్ కూడా అవుతున్నారు. ఇక నిన్న ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన హీరోయిన్ శృతిహాసన్ (Shruti Hassan) కూడా.. చెన్నై ఓటమిని భరించలేకపోయారు.
హైదరాబాద్ ( Hyderabad ) గెలవడంతో.. తమ చెన్నై ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు శృతిహాసన్. చెన్నై ఓడిపోగానే కన్నీళ్లు ఆమెకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తన కళ్లను తుడుచుకుంటూ..... చెన్నై ప్లేయర్ల ఆటతీరును ప్రశంసించారు శృతిహాసన్. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆమె కన్నీళ్లు చూసిన క్రికెట్ అభిమానులు... చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారని కామెంట్ చేస్తున్నారు.
దానికి నిదర్శనమే శృతిహాసన్ కన్నీళ్లు అని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో... తమిళ్ ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. హీరోయిన్ శృతిహాసన్ తో పాటు అజిత్ ఫ్యామిలీ కూడా చెన్నై స్టేడియంలో దర్శనమిచ్చింది. అటు శివ కార్తికేయన్ కూడా ఈ మ్యాచ్ తిలకించేందుకు వచ్చారు. వాళ్లకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ శృతిహాసన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో మాత్రం హైలైట్ అయింది.






