స్టేడియంలో ప‌డుకున్న విండీస్ ప్లేయ‌ర్‌..వీడియో వైర‌ల్ !

by velandi.Saikiran |

వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మధ్య ముంబై వేదికగా మ్యాచ్ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా షిమ్రోన్‌ హెట్ మెయర్ నిద్ర పోయాడు.

Shimron Hetmyer
X

Shimron Hetmyer

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్టేడియంలో లైవ్ మ్యాచ్ జరుగుతుండగా ఓ ప్లేయర్ హాయిగా నిద్రించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సోమవారం జింబాబ్వే, వెస్టిండీస్ జట్ల మధ్య సూపర్ 8 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన వెస్టిండీస్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా వెస్టిండీస్ ఆటగాడు షిమ్రోన్‌ హెట్ మెయర్‌ ( Shimron Hetmyer) స్టేడియంలో చేసిన పని వైరల్ గా మారింది. లైవ్ మ్యాచ్ జరుగుతుండగానే అతడు బౌండరీ గేటు వద్ద హాయిగా రిలాక్స్ అయ్యాడు.

ఓ కునుకు కూడా షిమ్రోన్‌ హెట్‌మెయర్‌ తీసినట్లు తెలుస్తోంది. ఓవర్ ముగిసిన సమయంలో మరో బౌలర్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది జరిగే క్రమంలో కాస్త టైం పడుతుంది. అయితే ఆ సమయాన్ని వినియోగించుకున్న షిమ్రోన్‌ హెట్ మెయర్‌, ఈ మ్యాచ్ లో కాస్త రిలాక్స్ గా పడుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు చూసి నవ్వుకుంటున్నారు. వెస్టిండీస్ ప్లేయర్లు ఎప్పుడు ఇలాగే ఫన్నీగా ఉంటారని, అప్పట్లో కిరాన్ పోలార్డ్‌ కూడా ఇలాగే వ్యవహరించే వాళ్ళని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోలార్డ్ త‌ర‌హాలోనే షిమ్రోన్‌ హెట్‌మెయర్ ఇప్పుడు చేస్తున్నాడ‌ని అంటున్నారు.

107 పరుగులు తేడాతో దారుణంగా ఓడిపోయిన జింబాబ్వే

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 స్టేజ్ లో ప్రతి మ్యాచ్ కూడా చాలా కీలకమే. ఒక్క మ్యాచ్ లో లైట్ తీసుకుంటే, ఇంటికి వెళ్లే ప్రభావం ఉంటుంది. అయితే గ్రూప్ స్టేజ్ లో అద్భుతంగా రాణించిన జింబాబ్వే, సూపర్ 8 స్టేజ్ వచ్చేసరికి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో దారుణంగా ఓడిపోయింది. వెస్టిండీస్ (West Indies) వర్సెస్ జింబాబ్వే ( Zimbabwe) మధ్య ముంబై వేదికగా సోమవారం సూపర్ 8 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో వెస్టిండీస్ విజయం సాధించగా, 107 పరుగుల తేడాతో జింబాబ్వే ఓటమిపాలైంది. ఆదివారం దక్షిణాఫ్రికా చేతిలో ఇండియా ఎలా చెత్త‌ ప్రదర్శన కనబరిచిందో, వెస్టిండీస్ చేతిలో కూడా జింబాబ్వే అలాగే ఆడింది. ఈ దెబ్బకు జింబాబ్వే ఓడిపోవాల్సి వచ్చింది. అయితే సూపర్ 8లో భాగంగా మొదటి మ్యాచ్ ఓడిపోయిన జింబాబ్వే, సెమీ ఫైనల్ ఆశలు గల్లంతు అయినట్లు చెబుతున్నారు. తన తర్వాతి మ్యాచ్ లో కచ్చితంగా రెండు మ్యాచ్ లు గెలిస్తేనే సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే జింబాబ్వే ఇంటి దారి పట్టాల్సిందే. ఇది ఇలా ఉండ‌గా, ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ ఆటగాడు షిమ్రోన్‌ హెట్ మెయర్‌ ( Shimron Hetmyer) 34 బంతులు ఎదుర్కొని, 85 ప‌రుగులు సాధించాడు.

Next Story