- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shikhar Dhawan: పేరు చెప్పను కానీ.. నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి తనే.. ప్రేమ బయటపెట్టేసిన స్టార్ క్రికెటర్
Shikhar Dhawan Girlfriend: భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెట్ శిఖర్ ధావన్ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిండంటే సంచలనమే

దిశ, వెబ్ డెస్క్: Shikhar Dhawan Girlfriend: భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెట్ శిఖర్ ధావన్ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిండంటే సంచలనమే. ఆయన పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ధవన్ మళ్లీ క్రికెట్ ఆడాలంటూ అభిమానులు పట్టుబడుతూనే ఉన్నారు. భారత క్రికెట్ జట్టు విజయవంతమైన క్రికెటర్లలో శిఖర్ ధావన్ కూడా ఒకరు. క్రికెటర్ గా మంచి పేరు సంపాదించుకున్న ధావన్ నిజజీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాడు. ఇద్దరు పిల్లల తల్లి ఆయేషా ముఖర్జీని వివాహం చేసుకున్నాడు. కానీ వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. విడాకులు తీసుకున్నారు. వీరిద్దరి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ధావన్ తన కుమారుడితో ఉన్న ఫొటోలను షేర్ చేస్తుంటాడు. విడాకులు తీసుకున్న రెండేళ్ల తర్వాత తనపై వస్తున్న రూమర్స్ పై ధావన్ మౌనాన్ని వీడారు.
టైమ్స్ నౌ సమ్మిట్ 2025 కు సంబంధించి ఓ వీడియోలో ధావన్ ను స్నేహితురాలు గురించి యాంకర్ ప్రశ్న అడిగింది. దానికి ఆయన స్పందిస్తూ...నేను పేరు చెప్పను కానీ నా ప్రపంచంలో అత్యంత అందమైన అమ్మాయి మాత్రం ఆమే అని తెలిపాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారి పాత వీడియోలు వైరల్ అయ్యాయి. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఓ యువతితో కలిసి మ్యాచ్ ను చూస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆమె ఐర్లాండ్ కు చెందిన సూఫీ షైన్ అంటూ పలు కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు పేరు చెప్పినప్పటికీ ఆమే తన గర్ల్ ఫ్రెండ్ అంటూ ధావన్ చెప్పకనే చెప్పాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.






