- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రొనాల్డోను వదలని సౌదీ టీం.. రూ.2000 కోట్ల డీల్!
రొనాల్డోను సౌదీ టీం వదలని అంటోంది. అతనితో ఏకంగా రూ.2000 కోట్ల డీల్ చేసుకున్నట్లు సమాచారం.

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరో భారీ ఒప్పందం చేసుకున్నాడు. సౌదీ ప్రో-లీగ్‌లో అల్-నాజర్ టీంకు ప్రాతినిధ్యం వహించిన రొనాల్డో.. తన టీంకు ట్రోఫీ అందించడంలో విఫలమయ్యాడు. ఈ టీం మూడో స్థానంలో టోర్నీ ముగించడంతోపాటు ఫిఫా క్లబ్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించడంలో కూడా విఫలమైంది. ఇలాంటి సమయంలో ‘ది చాప్టర్ ఈజ్ ఓవర్’ (ఈ చాప్టర్ ముగిసింది) అని అతను పోస్టు పెట్టడంతో.. రొనాల్డో అల్-నాజర్ టీంను వదిలేస్తున్నాడని వార్తలొచ్చాయి.
అయితే అలాంటిదేం లేదని, రొనాల్డో మరో రెండేళ్లు ఈ ఫ్రాంచైజీతో కొనసాగుతున్నాడని అల్-నాజర్ ప్రకటించింది. దీని కోసం అతనితో రెండేళ్లకుగాను ఏకంగా రూ.2000 కోట్ల డీల్ చేసుకున్నట్లు సమాచారం. సౌదీ లీగ్‌ను గత రెండున్నరేళ్లలో అభివృద్ధి చేయడంలో రొనాల్డో పాత్ర చ చాలా ఉందని సౌదీ ఫుట్‌బాల్‌లో మేజర్ ఇన్వెస్టర్ అయిన పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ (పీఐఎఫ్) ప్రకటించింది.






