- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CSK కొత్త కెప్టెన్‌గా సంజూ శామ్సన్..? రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు
ఐపీఎల్-2026 కొనసాగుతోన్న వేళ సీఎస్‌కే తదుపరి కెప్టెన్‌గా సంజూ శామ్సన్ వచ్చే అవకాశం ఉందంటూ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026 సీజన్‌కు సంబంధించి టీమిండియా (Team India) వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఓ సంచలన విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. భవిష్యత్తులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు నాయకత్వం వహించేది ఎవరో అశ్విన్ జోస్యం చెప్పాడు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సీఎస్కే జట్టుకు కెప్టెన్సీ అనుభవం ఉన్న ఆటగాడు కావాలని, ఇది వరకు సంజూ శామ్సన్ రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి గత సీజన్‌లో ఆ జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడని తెలిపారు. దీంతో సీఎస్కే యాజమాన్యం భవిష్యత్తులో, టోర్నీ మధ్యలోనైనా.. జట్టు పగ్గాలు సంజూ శామ్సన్‌కు ఇచ్చే అవకాశం ఉందని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ధోనీ వారసుడిగా సంజూ..
ఎంఎస్ ధోనీ (MS Dhoni) తర్వాత చెన్నై జట్టును ప్రశాంతంగా, సమర్థవంతంగా నడిపించగల లక్షణాలు సంజూలో ఉన్నాయని అశ్విన్ విశ్లేషించారు. సంజూ నాయకత్వ శైలి సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచనలకు దగ్గరగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం అశ్విన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తరుణంలో, అశ్విన్ చెప్పినట్లుగా సంజూ ఎంట్రీ ఇస్తే సమీకరణలు ఎలా మారుతాయన్నది ఆసక్తికరంగా మారింది.






