పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..ఆయోధ్య‌లో సాధువుల సంబ‌రాలు

by velandi.Saikiran |

పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..ఆయోధ్య‌లో సాధువుల సంబ‌రాలు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ లో ( T20 World Cup 2026 ) మరోసారి భారత జట్టు తన సత్తా చాటింది. దాయాది దేశం పాకిస్తాన్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది భారత్. కొలంబో వేదికగా ఆదివారం రోజున పాకిస్తాన్ తో భారత్ తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన భారత జట్టు, 61 పరుగుల తేడాతో శత్రుదేశం పాకిస్తాన్ ను మట్టి కనిపించింది. ఈ విజయంతో నేరుగా సూపర్ 8లోకి భారత జట్టు దూసుకు వెళ్ళింది. అంతేకాదు శివరాత్రి రోజున పాకిస్తాన్ ను (Pakistan Team) చిత్తుగా ఓడించిన నేపథ్యంలో భారత దేశ వ్యాప్తంగా సంబరాలు సంబరాన్ని అంటుతున్నాయి. అటు అయోధ్యలో ( Ayodhya ) కూడా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

అయోధ్యలో సంబరాలు చేసుకుంటున్న సాధువులు

శివరాత్రి రోజున పాకిస్తాన్ జట్టును ఓడించిన భారత్ ను ప్రశంసిస్తున్నారు అభిమానులు. అలాగే పాకిస్తాన్ ఓడిపోయినందుకుగాను భారత దేశ వ్యాప్తంగా సంబరాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అయోధ్య ( Ayodhya ) రామ మందిరం సమీపంలో కూడా సాధువులు, స్వామీజీలు సంబరాలు చేసుకుంటున్నారు. సాధువులు ( Saints) అయితే రోడ్డు పైకి వచ్చి మిఠాయిలు పంచుతున్నారు. శత్రు దేశం పాకిస్తాన్ ను ఇండియా చిత్తు చేసిందని చెబుతూ.. అందరికీ స్వీట్స్ తో పాటు తీర్థ ప్రసాదాలు కూడా పంచుతున్నారు. కాషాయ దుస్తుల్లో ఉన్న సాధువులు, స్వామీజీలు రోడ్లపై డ్యాన్సులు కూడా చేశారు. భారత జట్టుకు ( India) సంబంధించిన ఫోటోలను ప్రదర్శిస్తూ డాన్సులు చేస్తున్నారు. ఇండియా... ఇండియా అంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. అయోధ్యలో సాధువులు జరుపుకుంటున్న సంబరాలను చూసిన ఇండియన్ ఫాన్స్ కూడా తమ స్టైల్ లో స్పందిస్తున్నారు.

61 ప‌రుగుల‌తో విజ‌యం సాధించిన భార‌త్‌

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ( T20 World cup) భాగంగా భార‌త్‌, పాక్ మ‌ధ్య బిగ్ ఫైట్ జ‌రిగింది. కొలంబో వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించింది సూర్య భాయ్ సేన‌. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయింది భార‌త్ జ‌ట్టు. దీంతో ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది పాకిస్తాన్ టీమ్. దీంత అక్క‌డే భార‌త జ‌ట్టు సగం గెలిచిన‌ట్లు అయింది. దీనికి త‌గ్గ‌ట్టుగానే భార‌త జ‌ట్టు అద్భుతంగా రాణించింది సూర్య కుమార్ యాద‌వ్ సేన‌. ఈ త‌రుణం లోనే 20 ఓవ‌ర్లు ఆడి, 175 ప‌రుగులు సాధించింది. ఇక ఈ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో దారుణంగా ఓట‌మి పాలైంది. 18 ఓవ‌ర్స్ లోనే 114 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది పాక్‌. దీంతో ఇండియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో 77 ప‌రుగుల‌తో రాణించిన ఇషాన్ కిష‌న్ కు ( Ishan) బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇషాన్ కిష‌న్ కు ద‌క్కింది. క్లిక్

Next Story